పద్యం 4:

ఉపకారికి నుపకారము

విపరీతముగాదు సేయ వివరింపంగా

అపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!


భావం :-  మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.



సుమతీ శతకము