వేమన శతకము కర్త యోగి వేమన. ఇతని అసలు పేరు కుమారరెడ్డి వేమా రెడ్డి. ఇతడు పద్నాల్గవ శతాబ్దమునకు చెందిన తెలుగు కవి.
ఇతడు ప్రజా కవి; అన్ని వర్గాలమధ్య సమానత్వము కోసం పోరాడిన యోగి. వేమన వాడిన తెలుగు, సరళముగా వాడుక పదాలతో కూడినది. తన కవిత్వములో వేమన కవి సామాజిక లోటుపాటుల గురించి విఫులముగా తన అభిప్రాయములను వెల్లడించాడు. ఈ అభిప్రాయములు నేటికీ వర్తిస్తాయి అని చెప్పవచ్చు.
వేమన శతకముల ఛందస్సు "ఆటవెలది" (దీని అర్ధం నాట్యకత్తే). పద్యములు 4 పంక్తులతో కూర్చబడి ఉండి, చివరి పంక్తి మకుట పంక్తిగా ఉంటుంది - "విశ్వదాభిరామ వినుర వేమ" - అనగా "విశ్వదకు ప్రియమైన వాడ, ఓ వేమన!!"
వేమన గొప్పతనము అతడి చాటు పద్యాలలో ఉన్నది - ఈ ప్రక్రియలో పద్యములో అర్ధము నిగూఢముగా నిక్షిప్తమై ఉంటుంది. వేమన యోగి గొప్పతనము ఈ ఒక్క పద్యములో పంక్తి చాటుతుంది - "వేమన వాక్కు వేద వాక్కు"
0 Comments