పద్యం 7:-
అన్నిదానములను నన్న దానమే గొప్ప
కన్నతల్లికంటె ఘనములేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేడయా
విశ్వదాభిరామ వినురవేమ.
భావం - అన్నింటికంటే ఘనమైనది అన్నదానము.ఎన్ని దానములు చేసిన అసంతృప్తితో ఉన్నవారు అన్నము దానము చేయుటతోనే సంతుష్టులు అవుతారు.కన్నతల్లి కంటే లోకములో ఉత్తమమైనది, ఉన్నతమైనది మరేమీ లేదు.జ్ఞానము ప్రసాదించు గురువు కంటే మించినవారు ఎవరూ లేరు.ఇవి నిత్య సత్యాలు.
0 Comments