పాల నీడిగింటఁ గ్రోలుచునుండేనా | వేమన్న శతకాలు | వేమన్న పద్యాలూ - Vemanna Shathakaalu

పద్యం 9:

పాల నీడిగింటఁ గ్రోలుచునుండేనా

మనుజులెల్లఁగూడి మద్యమండ్రు

నిలువఁదగనిచోట నిలువ నిందలువచ్చు

విశ్వదాభిరామ వినురవేమ.



భావం- తాటి చెట్టు క్రింద నిలబడి పాలు తాగుతుదామంటే జనులు నమ్మెదరా,అలాగే కల్లు అమ్మేవాని ఇంట్లో ఉండి పాలు త్రాగిననూ దానిని జనులందరూ కల్లుగానే అనుకుందురు. నిన్ను అనుమానింతురు.అలాగే చెడ్డవాడితో కూడితే జనులు మనలను కూడా చెడ్డవానిగాను భావించెదరు.


వేమన్న పద్యాలూ 

Post a Comment

0 Comments