Movie: Daana Veera Soora Karna Movie Dialogue
Dialogue: Aacharya Dheva Emanti Emantivi
ఆచార్య దేవా !
యేమంటివి యేమంటివి
జాతి నెపమున సూతసుతునకిందు నిలువ అర్హత లేదంటివా ... ఎంత మాట ఎంత మాట ???
ఇది ఛాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ? కాదు కాకూడదు ...
ఇది కుల పరీక్షయే అందువా ... నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది ?
అతి జుగుప్సాకరమైన నీ సంభమెట్టిది ? మట్టి కుండలో పుట్టితివి కదా నీది యే కులము ?..
ఇంత యేల , అస్మత్ పితామహుడు కురుకుల వృద్దుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యయైన గంగా గర్భమున జన్మించలేదా... ఈయనది యే కులము ?
నాతో చెప్పిస్తివేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాదా?
అతడు పంచమి జాతి కన్య ఐన అరుంధతి యెందు శక్తిని ఆ శక్తి ఛండాలంగయందు పరశుని
ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్యుగందియందు మా తాత వ్యాసునీ ఆ వ్యాసుని విధవాండ్రాలైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అయిన అంబాలికతో మా పిన తండ్రి పాండురాజునూ మా ఇంటి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా?
సంధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కూలహీనమైనది
కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదములెందులకు?
0 Comments